ధాన్యం కొనుగోలు చేయాలని రైతుల ధర్నా

ధాన్యం కొనుగోలు చేయాలని రైతుల ధర్నా

SRCL: కోనరావుపేట మండలంలోని గొల్లపల్లిలో ధాన్యం కొనుగోలు చేయాలంటూ అన్నదాతలు రోడ్డెక్కారు. ధాన్యం బస్తాలు రోడ్డుపై వేసి రాస్తారోకో నిర్వహించారు. అకాల వర్షాలకు ఇప్పటికే నష్టపోయామని, వర్షం పడితే కొనుగోలు కేంద్రాలలో దాన్యం తడిసే అవకాశం ఉందన్నారు. వర్షాలు కురిసే సూచనలు కనిపిస్తున్నాయని, అధికారులు స్పందించి వెంటనే ధాన్యాన్ని కొనుగోలు చేయాలని అన్నారు.