మరియమాత మోక్షారోపణ మహోత్సవాలకు ఆహ్వానం

మరియమాత మోక్షారోపణ మహోత్సవాలకు ఆహ్వానం

విశాఖపట్నం జ్ఞానాపురంలోని పునీత పేతురు దేవాలయంలో మరియమాత మోక్షారోపణ మహోత్సవాలు ఆగస్టు 1న జెండా ఆవిష్కరణతో ప్రారంభమవుతాయి. కలరా వ్యాధి నివారణ నేపథ్యంగా 1900లో మొదలైన ఈ మహోత్సవం ఈ ఏడాది 125వ వార్షికోత్సవాన్ని జరుపుకుంటోంది. ఆగస్టు 6–14 వరకు నవదిన ప్రార్థనలు, ఆగస్టు 15న ప్రత్యేక బలిపూజలు, మరియమాత పేరుతో పురప్రదక్షిణ నిర్వహించనున్నారు.