VIDEO: ధ్వంసమైన శివాలయాన్ని పరిశీలించిన ఎమ్మెల్యే
నిజామాబాద్ నగరంలోని గోపాల్ బాగ్ ప్రాంతంలోని పురాతన శివాలయంపై జరిగిన దాడిని అర్బన్ ఎమ్మెల్యే ధన్‌పాల్ సూర్యనారాయణ మంగళవారం పరిశీలించారు. కాంగ్రెస్ హయాంలో హిందూ ఆలయాలపై దాడులు పెరిగాయని ఆయన విమర్శించారు. ఘటన జరిగి మూడు రోజులు గడుస్తున్నా సీఎం, మంత్రులు స్పందించకపోవడం దారుణమని మండిపడ్డారు. నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.