'నేటి నుంచి మామిడికుంట ఆంజనేయ స్వామి జాతర'

'నేటి నుంచి మామిడికుంట ఆంజనేయ స్వామి జాతర'

VKB: దుద్యాల్ మండలం చిల్ముల్ మైలారం గ్రామ అటవీ ప్రాంతంలో కొలువుదీరిన మామిడికుంట ఆంజనేయ స్వామి జాతర నేటి నుంచి ప్రారంభం కానుంది. గురువారం పెద్ద జాతర ప్రధాన ఘట్టం ఉంటుంది. మధ్యాహ్నం పల్లకీ సేవ, సాయంత్రం పెరుగు బసంతం కార్యక్రమాలు జరుగనున్నట్లు ఆలయ పూజారి రాఘవేంద్రచారీ, ధర్మకర్తలు తెలిపారు. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొనాలని విజ్ఞప్తి చేశారు.