విదేశాల్లోనూ సింగరేణి విస్తరణ
BDK: సింగరేణిని విదేశాల్లో విస్తరించేందుకు అధికారులు ప్రయత్నం చేస్తున్నారు. ఇప్పటికే ఇతర రాష్ట్రాల్లో గనులతో పాటు విద్యుత్ ప్రాజెక్టుల ఏర్పాటుకు చర్యలు చేపట్టారు. ఈమేరకు రానున్న రోజుల్లో విదేశాల్లో గనులు, ఖనిజాల తవ్వకాలకు అనుమతులు దక్కించుకునేందుకు అక్కడి దేశాలతో సంప్రదింపులు జరుపుతోంది. సింగరేణి బొగ్గు ఉత్పత్తిలో 135 ఏళ్ల చరిత్ర కలిగి ఉంది.