మంచినీటి ట్యాంకును ప్రారంభించిన మంత్రి

ELR: ఆగిరిపల్లిలో జలజీవన్ మిషన్‌లో భాగంగా రూ. 45 లక్షల వ్యయంతో నిర్మించిన మంచినీటి ట్యాంకును ఇవాళ రాష్ట్ర గృహ నిర్మాణ, సమాచార శాఖ మంత్రి కొలుసు పార్థసారథి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రజలకు సురక్షితమైన మంచినీటిని అందించేందుకే జలజీవన్ మిషన్ కింద మంచినీటి ట్యాంకులు, పైప్ లైన్లను నిర్మిస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో అధికారులు, టీడీపీ నేతలు పాల్గొన్నారు.