ఎక్కువ రేట్లకు సిలిండర్లు అమ్ముతున్నారా.. కాల్ చేయండి..!
CTR: గ్యాస్ సిలిండర్లపై అసత్య వార్తలు, ప్రచారాలు చేస్తే చర్యలు తప్పవని ఎస్పీ తుషార్ డూడీ ఇవాళ హెచ్చరించారు. సిలిండర్ల కొరత, ధరలు పెరిగాయని SMలో ప్రచారం చేస్తున్నట్లు వదంతులు వస్తున్నట్లు తెలిపారు. బ్లాక్ మార్కెటింగ్ చేసే వారిపై ప్రత్యేక నిఘా ఉంచామన్నారు. అధిక ధరకు సిలిండర్లు విక్రయిస్తే 112 నెంబర్‌కు సమాచారం ఇవ్వాలన్నారు. ప్రజలు అధికారిక సమాచారాన్ని విశ్వసించాలని కోరారు.