ఐదుగురు కార్యదర్శులకు ఛార్జీ మెమోలు

VKB: ధారూర్ మండలంలో ఫేక్ అటెండెన్స్‌కు పాల్పడ్డిన పంచాయతీ కార్యదర్శులకు ఛార్జీ మెమోలు సంబంధిత అధికారులు జారీ చేశారు. ధారూర్ మండల వ్యాప్తంగా 34 గ్రామ పంచాయతీలు ఉన్నాయి. అయితే ఇటీవల ఫేక్ అటెండెన్స్‌పై పంచాయతీరాజ్ కమిషనర్ ఆరా తీయగా ధారూర్ మండలంలోని 5 మంది కార్యదర్శులు ఫేక్ అటెండెన్స్‌కు పాల్పడినట్లు గుర్తించారు. దీంతో వారికి మెమోలు జారీ అయ్యాయి.