మైనర్లకు వాహనాలు ఇస్తే చర్యలు తప్పవు

మైనర్లకు వాహనాలు ఇస్తే చర్యలు తప్పవు

NLG: నార్కట్‌పల్లి ఎస్సై విష్ణుమూర్తి ఆదేశాలతో ఇవాళ పోలీసులు పట్టణంలో వాహనాల తనిఖీలు చేపట్టారు. ద్విచక్ర వాహనాలు నడుపుతూ పట్టుబడిన మైనర్లను స్టేషన్‌కు తరలించారు. అనంతరం వారి తల్లిదండ్రులను పిలిపించి, మైనర్లకు వాహనాలు ఇవ్వడం చట్టరీత్యా నేరమని, ఇది ప్రమాదాలకు దారితీస్తుందని కౌన్సెలింగ్ ఇచ్చారు. నిబంధనలు అతిక్రమిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు.