CP ఎదుట 28 మంది బైండోవర్

CP ఎదుట 28 మంది బైండోవర్

NZB: గణేశ్ విగ్రహాల నిమజ్జనం, మిలాద్-ఉల్-నబి, దుర్గామాత ఉత్సవాల నేపథ్యంలో మంగళవారం నిజామాబాద్ పోలీస్ కమిషనర్ సాయి చైతన్య ఎదుట 28 మందిని బైండోవర్ చేశారు. జిల్లాలోని వివిధ పోలీస్ స్టేషన్‌లలో కేసులు నమోదైన DJ ఆపరేటర్లు, DJ యజమానులు, ట్రబుల్ మేకర్స్‌ను బైండోవర్ చేశారు. వచ్చే 6 నెలల పాటు సత్ప్రవర్తనను కొనసాగించాలని సీపీ ఆదేశించారు.