ఆస్పత్రి పనులు పరిశీలించిన ఎమ్మెల్యే

ఆస్పత్రి పనులు పరిశీలించిన ఎమ్మెల్యే

PPM: గుమ్మలక్ష్మీపురంలో నూతనంగా నిర్మిస్తున్న 50 పడకల ప్రభుత్వ ఆసుపత్రి పనులను గురువారం ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే తోయక జగదీశ్వరి పరిశీలించారు. ఆస్పత్రి పనులను వేగవంతం చేయాలని అధికారులను ఆదేశించారు. ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించడమే ప్రభుత్వ లక్ష్యమని, ఆస్పత్రి ప్రారంభం అయితే వైద్య సదుపాయాలు మరింత అందుబాటులోకి వస్తాయని ఎమ్మెల్యే తెలిపారు.