ఇమ్రాన్ బతికే ఉన్నారు: పాక్ సెనెటర్
పాక్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ బతికే ఉన్నారని ఆయన పార్టీకి చెందిన సెనెటర్ వెల్లడించారు. ప్రస్తుతం రావల్పిండి అడియానా జైలులోనే సురక్షితంగా ఉన్నట్లు తెలిపారు. ఇమ్రాన్‌కు ఉన్న ప్రజాదరణ చూసి షరీఫ్ ప్రభుత్వం భయపడుతోందని.. అందుకే ఒక నెల నుంచి పూర్తిగా ఒంటరిగా ఉంచిందని చెప్పారు. కుటుంబం, న్యాయవాదులు, పార్టీ నాయకులెవ్వరూ కలవనీయకుండా చేస్తోందని మండపడ్డారు.