రాష్ట్ర స్థాయి పద్య రచనలో విద్యార్థినుల ప్రతిభ
SRCL: ఎల్లరెడ్డిపెట్ మండల కేంద్రంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలకు చెందిన విద్యార్థినులు సారిక, దివ్యజ్యోతి, హర్షిణి, సంజన, నందినిలు రాష్ట్ర స్థాయి పద్య రచన పోటీల్లో ప్రతిభ కనబర్చారని పాఠశాల హెచ్ఎం మనోహరచారి మంగళవారం తెలిపారు. బాలల దినోత్సవాన్ని పురస్కరించుకుని తెలంగాణ సారస్వత పరిషతు ఆధ్వర్యంలో నిర్వహించిన పద్య రచన పోటీల్లో విద్యార్థినులు సత్తా చాటారని పేర్కొన్నారు.