ఎన్నికల సామాగ్రి తీసుకునే రిసెప్షన్ అధికారులకు శిక్షణ

పశ్చిమగోదావరి: సార్వత్రిక ఎన్నికలలో భాగంగా మే 13న పోలింగ్ అనంతరం ఈవీఎంతో పాటు ఇతర ఎన్నికల సామాగ్రిని రిసీవింగ్ చేసుకునే అధికారులకు ఆదివారం ఆర్వో ఖాజావళి ట్రైనింగ్ ఇచ్చారు. 100 మందికి పైగా అధికారులకు రిసెప్షన్ స్టాప్ కి విధులు, విధానాలపై వివరించారు. 13న పోలింగ్ పూర్తయిన తర్వాత ఈవీఎంలు ఇతర ఎన్నికల సామాగ్రిని ఏలూరు సీఆర్‌ఆర్ రెడ్డి కాలేజీలో భద్రపరచనున్నారు.