మట్టికట్ట వద్దు.. ఫ్లైఓవర్ ఏర్పాటు చేయాలి
BHNG: చౌటుప్పల్ హైవేపై మట్టికట్ట నిర్మాణ పనులను వెంటనే నిలిపివేసి, పాత తాసీల్దార్ కార్యాలయం నుంచి వలిగొండ రోడ్డు వరకు ఫ్లై ఓవర్ ఏర్పాటు చేయాలని ఆదివారం మాజీ ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి డిమాండ్ చేశారు. పనులు నిలిపివేయకపోతే పెద్ద ఎత్తున ఉద్యమిస్తామని హెచ్చరించారు. స్థానిక ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఈ సమస్యను పరిష్కరించాలన్నారు.