పశువుల సంచారంపై కొనసాగుతున్న చర్యలు

SKLM: టెక్కలిలో పశువుల సంచారంపై అధికారులు చర్యలను కొనసాగిస్తున్నారు. టెక్కలి ప్రధాన రహదారిపై సంచరిస్తున్న పశువులను మంగళవారం రాత్రి గోసంరక్షణశాలకు తరలించారు. టెక్కలిలో పశువుల సంచారంపై ఇప్పటికే అధికారులు పూర్తిస్థాయిలో దృష్టి సారించారు. కాగా నిబంధనలకు టెక్కలి రోడ్లపైకి పశువులను విడిచిపెడితే, అపరాధ రుసుము విధిస్తామని పంచాయతీ అధికారులు స్పష్టం చేసారు.