రేపు యధావిధిగా పీజీఆర్ఎస్: కలెక్టర్

కోనసీమ: అమలాపురంలోని జిల్లా కలెక్టరేట్ గోదావరి భవన్‌లో సోమవారం ఉదయం 10 గంటల నుంచి ప్రజా సమస్యల పరిష్కార వేదిక (పీజీఆర్ఎస్) కార్యక్రమం నిర్వహించనున్నట్లు కలెక్టర్ మహేష్ కుమార్ ఆదివారం తెలిపారు. డివిజన్, మున్సిపల్, మండల స్థాయిలో కూడా ఈ కార్యక్రమాలు జరుగుతాయని, ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు.