తిరుచానూరు ఆలయంలో కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం
AP: తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయంలో శాస్త్రోక్తంగా కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం ఘనంగా నిర్వహించారు. 17 నుండి 25వ తేదీ వరకు జరగనున్న అమ్మవారి వార్షిక కార్తీక బ్రహ్మోత్సవాలను పురస్కరించుకొని ఆలయాన్ని పవిత్రంగా తీర్చిదిద్దారు. సుప్రభాతంతో అమ్మవారిని మేల్కొలిపి ఉ. 6 గంటల నుంచి 9 గంటల వరకు కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం చేపట్టారు.