రేపు జిల్లాలో BRS సన్నాహక సమావేశం: జీవన్ రెడ్డి
NZB: బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పిలుపు మేరకు ఈనెల 29న నిర్వహించనున్న 'దీక్షా దివస్'ను విజయవంతం చేయడానికి నిజామాబాద్‌లో రేపు సన్నాహక సమావేశం నిర్వహిస్తున్నట్లు బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు జీవన్ రెడ్డి తెలిపారు. తెలంగాణ చరిత్రలో నవంబర్ 29 ఒక మైలురాయి లాంటిదని ఆయన ఇవాళ పేర్కొన్నారు.