నేడు ఖైరతాబాద్ గణేషునికి మొదటి పూజ

నేడు ఖైరతాబాద్ గణేషునికి మొదటి పూజ

HYD: వినాయకుని నవరాత్రులు నేటి నుంచి ప్రారంభం కానున్నాయి. ఈ క్రమంలో ఖైరతాబాద్‌లోని మహా గణపతికి మొదట పూజ ఉదయం 10 గంటలకు నిర్వహించనున్నారు. ఈ పూజలో గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ, సీఎం  రేవంత్ రెడ్డి పాల్గొననున్నారు. కాగా, గణేషుడు బుధవారం 'శ్రీ విశ్వ శాంతి మహాశక్తి గణపతి'గా భక్తులకు దర్శనమివ్వనున్నాడు. ఇందుకు అన్ని ఏర్పాట్లను నిర్వాహణ కమిటీ సిద్దం చేసినట్లు పేర్కొంది.