బ్లాక్ మార్కెట్‌లోకి 610 సిలిండర్లు.. కేసు నమోదు
అక్రమంగా నిల్వ ఉంచిన LPG గ్యాస్ సిలిండర్ల ముఠాను ఢిల్లీ పోలీసులు రట్టు చేశారు. పక్కా సమాచారం మేరకు ఢిల్లీలోని ముండ్కాలోని ఒక గోడౌన్‌పై అధికారులు దాడి చేశారు. తమ తనిఖీల్లో అక్రమంగా నిల్వ ఉంచిన పలు కంపెనీలకు సంబంధించిన 610 గ్యాస్ సిలిండర్లను స్వాధీనం చేసుకుని సీజ్ చేశారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు ఘటనాస్థలం నుంచి పారిపోయిన నిందితుల కోసం గాలిస్తున్నారు.