'నాటిన మొక్కను కాపాడాలి'

'నాటిన మొక్కను కాపాడాలి'

విశాఖ: నాటిన ప్రతి మొక్కనూ కంటికి రెప్పలా సంరక్షించాల్సిన బాధ్యత అందరిపై ఉందని సర్పంచ్ గోపిశెట్టి శ్రీను అన్నారు. డ్వామా ఆధ్వర్యంలో వన మహోత్సవంలో భాగంగా కేపీ ఆగ్రహారంలో సోమవారం పలు రకాల పండ్ల మొక్కలను నాటారు. పర్యావరణ పరిరక్షణ ప్రతి ఒక్కరి బాధ్యతని గుర్తు చేశారు. పండ్ల మొక్కలను పెంచడంతో ఆరోగ్యకర, ఆర్థికపరమైన ప్రయోజనాలు పొందవచ్చన్నారు.