గవర్నర్‌ను కలిసిన వైస్ ఛాన్స్‌లర్
SKLM: ఎచ్చెర్ల డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ యూనివర్సిటీ వైస్ ఛాన్స్‌లర్ ఆచార్య డాక్టర్ కె.ఆర్ రజిని ఒడిస్సా గవర్నర్ డాక్టర్ కే. హరిబాబును, సోమవారం విశాఖపట్నంలోని ఆయన నివాస గృహంలో మర్యాదపూర్వకంగా కలిశారు. యూనివర్సిటీలో జరుగుతున్న తరగతులు నిర్వహణ వివరించారు. ఒడిస్సా రాష్ట్రం నుంచి అధికంగా విద్యార్థులు యూనివర్సిటీలో చదువుతున్నారని ఆయనకు వివరించారు.