'భారత్-పాక్ సరిహద్దు పరిధిలో ఉండొద్దు'

'భారత్-పాక్ సరిహద్దు పరిధిలో ఉండొద్దు'

ఢిల్లీలో పేలుడు ఘటన నేపథ్యంలో యూకే.. ట్రావెల్ అడ్వైజరీ జారీ చేసింది. భారత్-పాకిస్తాన్ సరిహద్దుకు 10 కి.మీ. పరిధిలో ఉండొద్దని తన పౌరులను హెచ్చరించింది. అలాగే, జమ్మూకాశ్మీర్‌లో కొన్ని ప్రాంతాల్లో పర్యటించొద్దని అప్రమత్తం చేసింది. శ్రీనగర్, గుల్‌మార్గ్, పహల్గామ్, సోన్‌మార్గ్‌లో పర్యటించేటప్పుడు స్థానిక అధికారులు ఇచ్చే సూచనలు పాటించాలని తెలిపింది.