ఎంఈవో చత్రూ నాయక్‌కు సన్మానం

SRPT: రాష్ట్ర ఉత్తమ ఉపాధ్యాయునిగా ఎన్నికైన గరిడేపల్లి మండల ఎంఈవో పానుగోతు చత్రూ నాయక్‌ను మంగళవారం గరిడేపల్లి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఉపాధ్యాయ సంఘాల ఆధ్వర్యంలో ఘనంగా సన్మానించారు. ఈ సంధర్భంగా ఆయన విద్య రంగానికి చేసిన సేవను కొనియాడారు. చత్రూ నాయక్‌కు రాష్ట్ర ఉత్తమ ఉపాధ్యాయ అవార్డ్ రావడం పట్ల వారు హర్షం వ్యక్తం చేశారు.