శ్రావణమాస సోమవారం.. కోటగుళ్లలో ప్రత్యేక పూజలు

శ్రావణమాస సోమవారం.. కోటగుళ్లలో ప్రత్యేక పూజలు

BHPL: శ్రావణ మాస ఉత్సవాల్లో భాగంగా సోమవారం కోటగుళ్లలో అర్చకులు నాగరాజు ఉదయం గణపతి పూజతో కార్యక్రమాలను ప్రారంభించి స్వామివారికి అభిషేకం నిర్వహించారు. వివిధ రకాల నైవేద్యాలను సమర్పించారు. మహిళలు తులసి, మారేడు, ఉసిరి, తెల్ల జిల్లేడు, మేడి, నాగదేవుని పుట్ట వద్ద దీపాలను వెలిగించారు. అనంతరం అర్చకులు భక్తులకు ఆశీర్వచనాలు, తీర్థ ప్రసాదాలు అందజేశారు.