4 లీటర్ల పెట్రోల్ దాచాడని.. 21 రోజులు జైలు శిక్ష

4 లీటర్ల పెట్రోల్ దాచాడని.. 21 రోజులు జైలు శిక్ష

యుద్ధం వల్ల ఇంధన కొరతతో దేశాలు అల్లాడుతున్నాయి. ఈ నేపథ్యంలో 4 లీటర్ల పెట్రోల్ దాచాడని శ్రీలంక కోర్టు బాలసూర్య అనే వ్యక్తికి 21 రోజుల జైలు శిక్ష, రూ.1,500 జరిమానా విధించింది. అతను అక్రమంగా పెట్రోల్‌ను నిల్వ చేసి బ్లాక్ మార్కెట్‌లో విక్రయించే ప్రయత్నం చేశాడని పోలీసులు వెల్లడించారు. అయితే, తాను ఇంటి పరిసరాల్లో చెత్తను కాల్చేందుకు తెచ్చుకున్నానని నిందితుడు తెలిపారు.