VIDEO: బాపట్లలో అంగన్వాడీల రిలే నిరాహార దీక్షలు
BPT: అంగన్వాడీ సమస్యలు వెంటనే పరిష్కరించాలని కోరుతూ బాపట్లలో ఐసీడీఎస్ కార్యాలయం ఎదుట సీఐటీయూ ఆధ్వర్యంలో మంగళవారం రిలే నిరాహార దీక్షలు చేపట్టారు. జిల్లా కార్యదర్శి ఎలిజిబెత్ రేఖ మాట్లాడుతూ.. సమ్మె సమయంలో ఇచ్చిన హామీలు నెరవేర్చాలని డిమాండ్ చేశారు. కనీస వేతనం రూ.26,000 ఇవ్వడంతో పాటు వేసవి సెలవుల జీవో విడుదల చేయాలని కోరారు.