రేపటి నుంచి మల్లన్న స్వామి వార్షికోత్సవాలు
SRD: సిర్గాపూర్ మండల కేంద్రంలో వెలసిన మల్లన్న స్వామి ఆలయం తృతీయ వార్షికోత్సవ వేడుకలు రేపటినుండి జరగనున్నాయి. ఈ మేరకు బుధవారం ఆలయం ఎదుట టెంట్లు, లైటింగ్ ఏర్పాట్ల పనులు కొనసాగుతున్నాయి. అయితే ఈ ఉత్సవాలు యాదవ సంఘం ఆధ్వర్యంలో 6 రోజులపాటు నిర్వహిస్తామని సంఘం బాధ్యులు తెలిపారు. పాలు పట్టుట కార్యక్రమంతో రేపు ఉత్సవాలు ప్రారంభమవుతాయన్నారు.