జనసేన పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమం

జనసేన పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమం

అన్నమయ్య: రామాపురం మండలం పప్పిరెడ్డిగారిపల్లెలో గురువార జనసేన పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా జనసేన నేత పప్పిరెడ్డి మహేశ్వర్ రెడ్డి మాట్లాడుతూ.. ఈ నెల 17వ తేదీ వరకు సభ్యత్వ నమోదు కొనసాగుతుందని తెలిపారు. నియోజకవర్గంలో 5,000 మందిని పార్టీ సభ్యులుగా చేర్చడం లక్ష్యంగా పనిచేస్తున్నామని చెప్పారు. కార్యక్రమంలో పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు.