VIDEO: అండర్ డ్రైనేజీ గుంతల వల్ల ప్రయాణికుల ఇబ్బంది
నల్లగొండ బస్టాండ్ ఎదుట రెండు నెలలుగా తవ్విన అండర్ డ్రైనేజీ గుంతలు యథావిధిగా ఉండడంతో ప్రయాణికులు, స్థానికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. బస్సుల రాకపోకలతో దట్టమైన దుమ్ము దూళి వ్యాపించి అనారోగ్య సమస్యలు పెరుగుతున్నాయి. కాంట్రాక్టర్ల నిర్లక్ష్యం, అధికారుల వైఫల్యంపై ప్రజల్లో ఆగ్రహం వ్యక్తమవుతోంది. గుంతలను వెంటనే పూడ్చాలని ప్రజల కోరుతున్నారు.