'రైతు వ్యతిరేక ప్రభుత్వంగా కాంగ్రెస్ ప్రభుత్వం'
KMM: రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వం రైతుల పట్ల పూర్తిగా నిర్లక్ష్య వైఖరి అవలంబిస్తోందని, పంటల కొనుగోలులో విఫలమై రైతులను నట్టేట ముంచుతోందని మాజీ ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య, మాజీ జిల్లా పరిషత్ ఛైర్మన్ లింగాల కమల్ రాజు తీవ్రంగా విమర్శించారు. మంగళవారం ఖమ్మం బిఆర్ఎస్ పార్టీ జిల్లా కార్యాలయంలో కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టారు.