నేడు ఆత్మకూరులో మెగా జాబ్ మేళా
NLR: ఆత్మకూరు ప్రాంత నిరుద్యోగ యువతకు ఉద్యోగ కల్పన లక్ష్యంగా స్కిల్ డెవలప్మెంట్ సంస్థ ఆధ్వర్యంలో గురువారం మెగా జాబ్ మేళా నిర్వహించనున్నారు. 25 కంపెనీలు పాల్గొంటున్న ఈ మేళాలో 1400పైగా ఉద్యోగాలు లభించే అవకాశం ఉంది. ఆంధ్రా ఇంజినీరింగ్ కాలేజీ వద్ద జాబ్ మేళా జరగనున్నట్లు నిర్వాహకులు తెలిపారు.