VIDEO: మందపల్లి శనేశ్వర స్వామి ఆలయంలో తైలాభిషేకాలు
కోనసీమ: కొత్తపేట మండలం మందపల్లి గ్రామంలో వేంచేసి ఉన్న శనీశ్వర స్వామి వారి ఆలయంలో శనివారం పురస్కరించుకుని అధిక సంఖ్యలో భక్తులు తరలివచ్చారు. వేకువ జాము నుంచి స్వామివారికి తైలాభిషేకాలు, ప్రత్యేక పూజలు నిర్వహించారు. దర్శనం చేసిన భక్తులకు అన్నదానాన్ని ఏర్పాటు చేశారు. భక్తులకు ఇబ్బందులు లేకుండా ఏర్పాట్లను ఈవో దారపురెడ్డి సురేష్ బాబు పర్యవేక్షించారు.