గుర్తుతెలియని మృతదేహం లభ్యం
నంద్యాల రైల్వే స్టేషన్‌లోని రెండో నంబరు ప్లాట్‌ఫాం వద్ద గుర్తుతెలియని మృతదేహం లభ్యమైనట్లు రైల్వే పోలీస్ హెడ్ కానిస్టేబుల్ ఖలీల్ అహ్మద్ సోమవారం తెలిపారు. మృతి చెందిన వ్యక్తికి సుమారు 40 ఏళ్లు ఉంటాయని ఆయన పేర్కొన్నారు. ఎవరైనా మృతుడిని గుర్తిస్తే రైల్వే పోలీసులకు ఫోన్ చేసి 94900 81633 సమాచారం అందించాలని విజ్ఞప్తి చేశారు.