పాచిపెంటలో డిప్యుటీ సీఎం రాజన్నదొర ప్రచారం

విశాఖ: మండల కేంద్రంలో శనివారం సాలూరు వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి పీడీక రాజన్నదొర ప్రచారం నిర్వహించారు. రానున్న ఎన్నికల్లో ఫ్యాన్ గుర్తుకి ఓటు వేసి గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ ప్రతినిధి వీరంనాయుడు, మండల అధ్యక్షులు జి. ముత్యాల నాయుడు, వైస్ఎంపీపీలు మీసాల నారాయణ, కోరిపిల్లి రవీంద్రనాథ్, నాయకులు డోలా బాబ్జి తదితరులు పాల్గొన్నారు.