ఉరేసుకుని వ్యక్తి ఆత్మహత్య
అన్నమయ్య: రాజంపేట పట్టణంలో బుధవారం రాత్రి యేమిరెడ్డి హరి ప్రసాద్ రెడ్డి (39) అనే వ్యక్తి విషం తాగి, ఉరి వేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఆర్థిక ఇబ్బందులు, కుటుంబ కలహాలతో మనస్థాపానికి గురై ఈ ఘాతుకానికి పాల్పడినట్లు తెలుస్తోంది. కర్నూలు జిల్లా చిన్న వంగలి గ్రామానికి చెందిన హరి ప్రసాద్ రెడ్డి, భార్య పుట్టింటికి వెళ్లడంతో ఇంట్లో ఒంటరిగా ఉన్న సమయంలో ఈ ఘటన జరిగింది.