అవయవ మార్పిడిపై మంత్రి దామోదర సమీక్ష

అవయవ మార్పిడిపై మంత్రి దామోదర సమీక్ష

TG: ప్రైవేట్ ఆస్పత్రుల్లో అవయవ మార్పిడికి అధిక ధరలపై మంత్రి దామోదర రాజనర్సింహ ఆగ్రహం వ్యక్తం చేశారు. THOTA పాలసీపై సమీక్షించిన ఆయన, ఈ చికిత్సలు సామాన్యులకు అందుబాటులో ఉండాలని, టారిఫ్ నియంత్రణకు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. విదేశీ రోగుల ట్రాన్స్‌ప్లాంట్ కోసం కొత్త విధివిధానాలు తీసుకురానున్నట్లు తెలిపారు. పేదల ప్రాణాలకు భరోసా ఇచ్చేలా ఆస్పత్రులు నడుచుకోవాలని సూచించారు.