లేబర్ బోర్డు ప్రైవేట్ పరం చేయొద్దు :CITU
BDK: భవన నిర్మాణ కార్మిక సంఘం సీఐటీయూ ఆధ్వర్యంలో బూర్గంపాడు మండలం సారపాక ఆఫీసులో శ్రీను అధ్యక్షతన ఇవాళ సమావేశం నిర్వహించారు. సీఐటీయూ బత్తుల వెంకటేశ్వర్లు మాట్లాడుతూ.. బీజేపీ ప్రభుత్వం లేబర్ ఇన్సూరెన్స్ బోర్డును ప్రైవేటు కార్పొరేట్లకు కట్టబెట్టాలని చూస్తుందన్నారు. భవన నిర్మాణ కార్మికులకు ఉన్న అవకాశాలన్నీ కూడా లేకుండా చేశారని ఆవేదన వ్యక్తం చేశారు.