రైల్ నుంచి జారిపడి రిటైర్డ్ ఉద్యోగి మృతి

MDK: మనోహరాబాద్ మండల కేంద్రానికి చెందిన రైల్వే రిటైర్డ్ ఉద్యోగి తాడేపు కిష్టయ్య(71) రైలు నుంచి జారిపడి శనివారం మృతి చెందాడు. కిష్టయ్య ఈరోజు మనోహరాబాద్ నుంచి రైల్లో మల్కాజిగిరి వెళ్ళాడు. తిరిగి స్వగ్రామానికి వస్తుండగా మధ్యలో ప్రమాదవశాత్తు జారిపడగా రెండు కాళ్లు దెబ్బతిన్నాయి. ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందినట్లు తెలిపారు.