విద్యార్థుల మధ్య వాగ్వాదం.. పాఠశాలకు తాళం
AP: విద్యార్థుల మధ్య వాగ్వాదం పాఠశాల గేటుకు తాళం వేసే వరకు వెళ్లింది. ఆరో తరగతి విద్యార్ధిపై పదో తరగతి విద్యార్థి దాడి చేశాడని అతని తండ్రికి ఫిర్యాదు చేశాడు. దీంతో ఆగ్రహనికి గురైన ఆ బాలుడి తండ్రి పాఠశాల గేటుకు తాళం వేసి వెళ్లిపోయాడు. దీంతో ఉపాధ్యాయులు పోలీసులకు ఫోన్ చేయడంతో.. అతడిని పిలిపించి హెచ్చరించారు. సమస్యను టీచర్లకు చెప్పినా పట్టించుకోలేదనే అలా చేశానని అన్నాడు.