సీఎం చంద్రబాబు ఉగాది శుభాకాంక్షలు
AP: శ్రీ పరాభవ నామ సంవత్సర ఉగాది సందర్భంగా తెలుగు ప్రజలకు సీఎం చంద్రబాబు శుభాకాంక్షలు తెలిపారు. ఈ నూతన సంవత్సరం అందరి జీవితాల్లో కొత్త వెలుగులు నింపాలని ఆకాంక్షించారు. పేదరికం లేని సమాజం కోసం పీ4, సంక్షేమ పథకాలు, 'స్వర్ణాంధ్ర విజన్ 2047' విజయవంతంగా సాగాలని తెలిపారు. ప్రజలందరూ ఆయురారోగ్యలతో వర్ధిల్లాలని సీఎం ఆకాంక్షించారు.