రోడ్డు ప్రమాదంలో మహిళ మృతి

RR: నందిగామ మండలం సీడీతాండ గ్రామపంచాయతీ పరిధిలో గల బైపాస్ జాతీయ రహదారి కల్వర్టు వంతెన వద్ద బుధవారం గుర్తుతెలియని వాహనం ఢీకొనడంతో చాందిని అనే మహిళ మృతి చెందింది. దీంతో మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం షాద్ నగర్ ప్రభుత్వాసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.