పల్లెలుగా మారిన పట్టణాలు..!
HYD: నగరంలో ఎటు చూసినా కట్టెల పొయ్యి సెగలే కనిపిస్తున్నాయి. గ్యాస్ సిలిండర్ల కొరతతో హోటళ్లు, రెస్టారెంట్లు తప్పనిసరి పరిస్థితుల్లో పల్లె పద్ధతులకు మళ్లాయి. అత్యాధునిక కిచెన్లలో సైతం పొగ చూరుతోంది. ఓ వైపు కట్టెల పొయ్యి వంట రుచిగా ఉందని వినియోగదారులు అంటున్నారు. వీటికి సంబంధించి వీడియోలు చూసిన నెటిజన్లు 'ఆధునిక కాలంలో మళ్ళీ పాత రోజుల్లోకి వెళ్తున్నామా?' అని కామెంట్స్ చేస్తున్నారు.