కూకట్ పల్లి బాలిక హత్య.. వీడని మిస్టరీ

కూకట్ పల్లి బాలిక హత్య.. వీడని మిస్టరీ

TG: 4 రోజుల క్రితం కూకట్ పల్లిలో హత్యకు గురైన బాలిక సహస్ర కేసు చిక్కుముడి వీడటం లేదు. ప్రధానంగా అనుమానించిన ఒడిశాకు చెందిన వ్యక్తి నుంచి ఎలాంటి సమాచారం రాలేదట. ఇప్పటికే పలుమార్లు సహస్ర తల్లిదండ్రులను ఇంటి దగ్గర విచారించిన పోలీసులు.. చివరికి PSకి పిలిపించి విచారణ జరుపుతున్నారు. పోలీసులు ఎన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నా.. చిన్న క్లూ కూడా దొరకకపోవడం చర్చనీయాంశంగా మారింది.