రక్తదాతలను అభినందించిన జిల్లా ఎస్పీ
BDK: యంగ్ ఇండియా బ్లడ్ డొనేషన్ క్లబ్ ఆధ్వర్యంలో ఆదివారం సింగరేణి హై స్కూల్లో రక్తదాన శిబిరాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా జిల్లా ఎస్పీ రోహిత్ రాజ్ పాల్గొన్నారు. రక్తదాన శిబిరంలో జిల్లా బంజారా సంఘాల జేఏసీ వైస్ ఛైర్మన్ బానోత్ వీరు నాయక్ రెండోసారి రక్తదానం చేశారు. అనంతరం రక్తదానం చేసిన వారిని జిల్లా ఎస్పీ అభినందించారు.