రేపు విద్యుత్ సరఫరాలో అంతరాయం

రేపు విద్యుత్ సరఫరాలో అంతరాయం

BHPL: భూపాలపల్లి మున్సిపాలిటీ పరిధిలోని 11 కేవీ జంగేడు ఫీడర్‌పై చెట్ల కొమ్మలు తీయుట, లైన్ మరమ్మతులు బుధవారం చేయనున్నట్లు ఏఈ విశ్వాస్ రెడ్డి తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మరమ్మతుల కారణంగా పెద్దకుంటపల్లి, పుల్లూరిరామయ్యపల్లి, గండ్రపల్లి, మహబూబ్ పల్లి, పిల్లోనిపల్లి గ్రామాలలో ఉదయం 8.30 గం.ల నుంచి మధ్యాహ్నం 12 గం.ల వరకు విద్యుత్ సరఫరాలో అంతరాయం ఉంటుందన్నారు.