VIDEO: 'పట్టుదల, క్రమశిక్షణతో ముందుకు సాగాలి'
కృష్ణా: గుడివాడ మండలం మోటూరు గురుకులం పాఠశాల 10వ తరగతి విద్యార్థులతో గురువారం మధ్యాహ్నం మాట మంతి కార్యక్రమంలో ఎమ్మెల్యే వెనిగండ్ల రాము పాల్గొన్నారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ.. ప్రతి ఒక్కరికి విద్యార్థి దశ కీలకమని అన్నారు. పట్టుదల, క్రమశిక్షణ, స్ఫూర్తితో ముందుకు సాగితే అనుకున్న లక్ష్యాలను సాధించడం పెద్ద కష్టం కాదని తెలిపారు.