సీసీ రోడ్డును ప్రారంభించిన ఎమ్మెల్యే

TPT: చిల్లకూరు మండలం తమ్మినపట్నం గ్రామంలో రూ. 5 లక్షలతో నిర్మించిన సీసీ రోడ్డును గూడూరు ఎమ్మెల్యే డాక్టర్ పాశం సునీల్ కుమార్ ప్రారంభించారు. ఈ మేరకు ఆయన మాట్లాడుతూ.. నియోజకవర్గ అభివృద్ధి తన లక్ష్యమన్నారు. పదవులు శాశ్వతం కాదని, చేపట్టిన అభివృద్ధి పనులు, సేవలే శాశ్వతమని తెలిపారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు పాల్గొన్నారు.