VIDEO: తెలంగాణ ఆడబిడ్డకు కవిత మద్దతు
KMR: జిల్లా బీబీపేట్ మండలం యాడవరం గ్రామానికి చెందిన గన్నమనేని ప్రణతిరావు అనే యువతి మిస్ తెలుగు యూఎస్ఏ-2026 పోటీలకు ఎంపిక కావడంపై శుక్రవారం తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత హర్షం వ్యక్తం చేశారు. మన తెలంగాణ ఆడబిడ్డ ఏప్రిల్ 4వ తేదీన జరిగే పోటీల్లో విజయం సాధించాలని ఆమె ఆకాంక్షించారు. రాష్ట్ర ప్రజల ఆశీస్సులు ఆమెకు ఉండాలని కోరారు.